ఆయకట్టు వరకు సాగునీటిని అందించాలి: ఎమ్మెల్యే KR నాగరాజు

Sakshitha news

ఆయకట్టు వరకు సాగునీటిని అందించాలి: ఎమ్మెల్యే KR నాగరాజు …

వర్ధన్నపేట నియోజకవర్గంలోని రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రతి ఆయకట్టు వరకు సాగునీటి నీటిని విడుదల చేయాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,పొంగులేటి శ్రీనివాసరెడ్డి ,సీతక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల (ఇరిగేషన్) శాఖ ప్రధాన కార్యాలయంలో సమావేశంలో పాల్గొని మాట్లాడారు.నియోజకవర్గంలోని రైతులకు ఎల్ నినో ప్రభావం నుండి వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు లేదా ప్రత్యామ్నాయ పంటల గురించి చర్చించారు.ఆరుతడి పంటలు వేసిన ప్రతి రైతుకు సాగునీటిని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top