కనులు విందుగా మంగళ గౌరీ వ్రతం.

Sakshitha news

కనులు విందుగా మంగళ గౌరీ వ్రతం.

మంగళ గౌరీ వ్రతంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మహిళలు

ఆర్యవైశ్యుల సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రావణ మంగళవారం మంగళ గౌరీ వ్రతం పూజారి నందకిషోర్ పర్యవేక్షణలో సాంప్రదాయ బద్ధంగా, పరిమళ పుష్పాలతో, వేద పండితుల మంత్రోచ్ఛారణతో, అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఉదయకర్తలుగా చం దోలు నిరంజన్ రావు, లక్ష్మీ కుమారి దంపతుల తనయుడు చందోలు అనిల్ కుమార్ శ్వేత కామాక్షి దంపతులు భక్తిశ్రద్ధలతో ఉభయ నైవేద్యాలు సమర్పించుకున్నారు.

కనుల విందుగా కనిపించిన మంగళ గౌరీ మాతను దర్శించుకుని, మంగళ గౌరీ వ్రతంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ పుణ్యహితులయ్యారు. అనంతరం పూజారి దంపతులకు ఉదయకర్తలు చిరు సత్కారం చేశారు.మా ఆర్యవైశ్యుల సంఘం దైవ కార్యక్రమాలకి ముందుంటుందని రాబోవు తరాలు కూడా ఈ దేవాలయ ప్రతిష్టను ముందుకు తీసుకొని పోతారని తెలిపారు. అనంతరం ప్రతి ఒక్కరికి తీర్థప్రసాదాలు అందించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ సి.హెచ్ వెంకటేశ్వర్లు, సెక్రటరీ యస్. రమేష్ బాబు, కోశాధికారి మెంటా రమేష్ బాబు, ఆర్యవైశ్య సంఘం, భక్తులు, పాల్గొన్నారు…

Scroll to Top