మోకాళ్ల నొప్పులు మందులతో తగ్గుతాయనెది అపోహ మాత్రమే

Sakshitha news

మోకాళ్ల నొప్పులు మందులతో తగ్గుతాయనెది అపోహ మాత్రమే

సాక్షిత వనపర్తి ఆగస్టు 25

మోకాళ్లనొప్పులుకేవలంఇంజెక్షన్లతోపూర్తిగాతగ్గిపోతాయనేది కేవలం అపోహ మాత్రమేనని, ఇలాంటి ప్రచారాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వినయ్ కుమార్ అన్నారు. ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ప్రస్తుత కాలంలో కీళ్లు మోకాళ్ల నొప్పులతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, శాశ్వత పరిష్కారం చూపేందుకు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు.

మోకాలి, కీళ్ల మార్పిడి, భుజం సమస్యల కోసం అత్యంత ఆధునికమైన పూర్తి స్థాయి రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ చికిత్సలను అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ అడ్వాన్స్‌డ్ రోబోటిక్ ట్రీట్‌మెంట్ ద్వారా మోకాలి జాయింట్స్ ఎలాంటి వంకర లేకుండా, పూర్తిగా నార్మల్స్థితికివచ్చేలానూరుశాతంఖచ్చితత్వంతోచికిత్సఅందించడంసాధ్యమవుతుందనిపేర్కొన్నారు. సర్జరీ జరిగిన కేవలం రెండు రోజుల్లోనే పేషెంట్‌ను సొంతంగా నడిపించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో యశోద ఆసుపత్రి మార్కెటింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్స్ సతీష్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top