అర్హులైన ఏ ఒక్క ఓటరూ జాబితా నుంచి తప్పిపోకూడదు….

Sakshitha news

అర్హులైన ఏ ఒక్క ఓటరూ జాబితా నుంచి తప్పిపోకూడదు….

ఈ నెల 27న రామగుండం నగరంలో వార్డు సభలు – అదనపు కలెక్టర్ అరుణశ్రీ….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/ : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఈ నెల 27న. రామగుండం నగరంలోని అన్ని డివిజన్ల పరిధిలో వార్డు సభలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె. అరుణశ్రీ తెలిపారు.

వార్డు సభల నిర్వహణపై మంగళవారం ఎన్‌టీపీసీ మిలీనియం హాల్‌లో వార్డు అధికారులు, వార్డు సహాయకులు, బూత్‌ స్థాయి అధికారి పర్యవేక్షకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ముసాయిదా ఓటర్ల జాబితాలోని పేర్లను చదవడం, జాబితాపై అభ్యంతరాలు స్వీకరించడం, ఫారం నంబర్లు 6, 7, 8 దరఖాస్తులను స్వీకరించడం కోసం వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రామగుండం నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,13,990 మంది ఓటర్లు ఉండగా, ముసాయిదా జాబితాలో 1,83,233 మంది ఓటర్ల పేర్లు మాత్రమే ప్రకటించిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. నో మ్యాపింగ్ కింద 5,500 మందికి, అనామలీస్ కింద 49,034 మందికి నోటీసులు జారీ చేసి, వారి నుంచి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను స్వీకరించాలని అధికారులను ఆదేశించారు.

నిర్ణీత గడువులోగా ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని, అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
27న వార్డు సభలు జరిగే ప్రాంతాలు
రామగుండం నగరంలోని 1వ డివిజన్ నుంచి 60వ డివిజన్ వరకు కేటాయించిన ప్రాంతాల్లో వార్డు సభలు నిర్వహించనున్నారు.

ఆయా డివిజన్ల వారీగా సభా కేంద్రాలు:
1: మండల పరిషత్ పాఠశాల, పీకే రామయ్య కాలనీ
2: వినాయక మండపం, నర్రసాలపల్లి
3: ప్రశాంత్‌నగర్ బోర్డు, హనుమాన్ గుడి దగ్గర
4: వినాయక మండపం, ఉదయ్‌నగర్
5: వినాయక మండపం, గంగానగర్
6: జనగామ గ్రంథాలయం
7: జీఎం కాలనీ హనుమాన్ దేవాలయం
8: అంగన్‌వాడీ కేంద్రం, బాపూజీనగర్
9: ప్రెస్‌క్లబ్ ఎదురుగా, వినోభానగర్
10: సుదర్శన్ ఆసుపత్రి వీధి
11: శ్రీరామ యూత్ అసోసియేషన్ ఎదురుగా
12: మహిళా భవన్
13: సీనియర్ సిటిజన్ పార్క్
14: శివాలయం సమీపంలో, రాజీవ్‌నగర్
15: గ్రామ పంచాయతీ కార్యాలయం, వెంకట్రావుపల్లి
16: శ్రీ వాణి ప్లే స్కూల్, షిర్కే బస్‌స్టాప్
17: సంతోష్‌నగర్ వినాయక మండపం
18: హనుమాన్ దేవాలయం వద్ద
19: అల్లూరు మర్రిచెట్టు
20: జెడ్పీహెచ్‌ఎస్, న్యూమారేడుపాక
21: హనుమాన్ దేవాలయం, లక్ష్మీపురం
22: గౌతమినగర్ సొసైటీ కార్యాలయం
23: అంబేద్కర్ భవన్
24: వినాయక మండపం, పీటీఎస్
25: హనుమాన్ టెంపుల్ రోడ్
26: హనుమాన్ టెంట్ హౌస్, రైల్వే స్టేషన్ సమీపంలో
27: ముబారక్‌నగర్ బోర్డు, ఫ్లైఓవర్ దగ్గర
28: మర్రిచెట్టు సెంటర్, రామగుండం గ్రామం
29: లింగాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం
30: మజీద్ కార్నర్
31: చిలకలయ్య దేవాలయం
32: దుర్గయ్యపల్లి ప్రభుత్వ పాఠశాల
33: అంబేద్కర్ భవన్
34: శ్రీనివాస్ లాడ్జ్ ఎదురుగా లేన్, కృష్ణానగర్
35: బుచ్చయ్య దుకాణం దగ్గర వినాయక మండపం
36: ఎల్‌బీ యూత్
37: డాక్టర్ సదానందం క్లినిక్ దగ్గర
38: మల్లికార్జున్‌నగర్ సిటిజన్ హౌస్
39: అంబేద్కర్ భవన్
40: వడ్ల సంఘం
41: సీనియర్ సిటిజన్ హాల్
42: వినాయక మండపం
43: అంగన్‌వాడీ కేంద్రం నం.104
44: ఆదర్శ పాఠశాల
45: వినాయక మండపం
46: మండల పరిషత్ పాఠశాల, పోలీసు బడి
47: లక్ష్మీ గణపతి కిరాణం
48: వినాయక మండపం, చంద్రబాబు కాలనీ
49: నారాయణ్ స్కూల్ దగ్గర
50: వంక బెండు దగ్గర, వినాయక మండపం
51: స్వతంత్ర చౌక్, పాత పోస్టాఫీస్
52: అబ్దుల్ కలాం విగ్రహం, అడ్డగుంటపల్లి
53: తిరుమలనగర్
54: జవహర్‌నగర్
55: తిలక్‌నగర్ గణేష్ మందిరం దగ్గర
56: గణేష్ మందిర్ దగ్గర
57: మహిళా భవన్
58: ద్వారకానగర్, యూపీహెచ్‌సీ
59: మహిళా భవనం
60: మార్టిన్‌నగర్ వాటర్ ట్యాంక్ ఎదురుగా
ఈ వార్డు సభలకు సంబంధిత ఓటర్లు హాజరై ముసాయిదా జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలని, ఏవైనా అభ్యంతరాలు లేదా మార్పులు ఉంటే సంబంధిత దరఖాస్తుల ద్వారా తెలియజేయాలని అధికారులు సూచించారు.
ఈ సమావేశంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి మండలాల తహసీల్దార్లు రవీందర్, ప్రసాద్, సునీత తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top