సూర్యాపేటకు రైల్వే లైన్ సాధనే లక్ష్యం
టేకుమట్లలో నిరసన
సాక్షిత ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో
సూర్యాపేట జిల్లాకు రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో గ్రామ బస్టాండు వద్ద ప్లెక్సీలను ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైల్వే సాధన సమితి టేకుమట్ల గ్రామ కన్వీనర్ కె. సిద్ధారెడ్డి మాట్లాడుతూ, సూర్యాపేట జిల్లా అభివృద్ధి పరంగా వేగంగా ముందుకు సాగుతున్నప్పటికీ ఇప్పటికీ రైల్వే సౌకర్యం లేకపోవడం బాధాకరమని అన్నారు.
జిల్లాలో పారిశ్రామిక, వ్యవసాయ, విద్యా, వాణిజ్య రంగాలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. సూర్యాపేటకు రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. రైల్వే లైన్ సాధన కోసం ప్రజల మద్దతుతో ఉద్యమాన్ని కొనసాగిస్తామని, లక్ష్యం నెరవేరే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గం వెంకటయ్య, మేడి యాదయ్య, వంశీ, సిద్ధూ, నాగరాజు, శ్రీనివాస్, రాంబాబు, శంకర్, లోకేష్, కార్తీక్‌తో పాటు గ్రామ యువకులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
