శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి మరియు శ్రీ భౌరంపేట్ బంగారు మైసమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్ పరిధిలోని భౌరంపేట్ డివిజన్ భౌరంపేట్ గ్రామంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం (బౌరమ్మగుడి) వార్షికోత్సవం మరియు శ్రీశ్రీశ్రీ భౌరంపేట్ బంగారు మైసమ్మ తల్లి బోనాల ఉత్సవాల సందర్భంగా ఈరోజు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు రెండు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముందుగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీశ్రీశ్రీ భౌరంపేట్ బంగారు మైసమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.
ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, భౌరంపేట్ గ్రామంలో శాంతి, సౌభాగ్యం, సుఖసంతోషాలు వెల్లివిరియాలని, గ్రామం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని స్వామివారిని, అమ్మవారిని ప్రార్థించారు..
ఈ కార్యక్రమాల్లో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
