కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా గాజులరామారం మరియు మహదేవపురం డివిజన్లలో రూ.1.16 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ శంకుస్థాపన చేశారు.

గాజులరామారం డివిజన్ పరిధిలో శ్రీరామ్ నగర్ లో రూ.26.50 లక్షలతో మంజూరైన అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, మహాదేవపురం డివిజన్ పరిధిలోని యండమూరి లేఅవుట్లో రూ.60 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి, శివపురం కాలనీలో రూ.30 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన నిర్వహించారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు.
గత బీఆర్ఎస్ పాలనలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయిందని ఆయన విమర్శించారు. ప్రజల అవసరాలను తీర్చడంలో అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు, త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమలు చేయనున్నట్లు తెలిపారు..
ఈ కార్యక్రమాల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ , సిహెచ్ బుచ్చిరెడ్డి, యాము సాగర్, దంపనబోయిన శ్రీనివాస్, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు శ్రీనివాసరెడ్డి, దివాకర్, వెంకటేశ్వర్ రెడ్డి, సుమన్ రెడ్డి, శ్రీధర్, తిరుపతి రెడ్డి, నాగరాజు, ప్రసాద్ రెడ్డి, మహేష్, రాజేష్ గౌడ్, ఏకాంబరం, సుమన్, ధనరాజ్, చంద్రశేఖర్ మరియు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
