ప్రజలను మోసం చేస్తున్న బీజేపీని గద్దెదించుదాం.
సిపిఐ జాతీయ సమితి సభ్యులు యూసఫ్.
సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా నేడు సిపిఐ ప్రచార యాత్ర లో భాగంగా షాపూర్ నగర్ బస్ స్టాప్ వద్ద ముగింపు సభ సిపిఐ కుత్బుల్లాపూర్ సమితి తరపున నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ సమితి సభ్యులు ఎండి యూసఫ్ పాల్గొని బిజెపి అధికారంలోకి వచ్చాక కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ బ్రిటిష్ పాలనలో పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను రద్దుచేసి కార్పొరేట్ పెట్టుబడిదారీ యాజమాన్యాలకు ఉపయోగపడే విధంగా కార్మిక నూతన లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని దీనివల్ల కార్మికులు సమ్మేహక్కును ఉద్యోగ భద్రతను కనీస వేతనాల హక్కులను ప్రమాదవశాత్తు బీమా పొందే హక్కును సంఘాలను స్థాపించిన హక్కులను కోల్పోయిందని పైకి మంచిగా కనిపించినప్పటికీ లోపలి సారమంతా యాజమాన్యాలకు ఉపయోగపడే విధంగా బిజెపి నరేంద్ర మోడీ చేసి వ్యాపారస్తులకు తమ భక్తిని చాటాయని విమర్శించారు. అంతేకాకుండా నిత్యవసర వస్తువుల ధరలు తగ్గిస్తానని హామీ ఇచ్చి ధరలను తగ్గించకుండా ధరలను విపరీతంగా పెంచి ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు నెట్టిన బిజెపి నరేంద్ర మోడీ శ్రీరాముడి పేరుతో హిందూ పేరుతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నించారని కానీ అయోధ్య రామాలయంలో జరిగిన దొంగతనాన్నీ చూసి ప్రజలు బిజెపి మరియు మోడీ యొక్క అసలు రూపాన్ని తెలుసుకున్నారని అందుకే నరేంద్ర మోడీ మరియు అమిత్యాలు పార్లమెంట్‌కు రాకుండా ప్రజలకు భయపడి దూరంగా ఉన్నారని ఈ సంఘటనలను చూస్తే రానున్న రోజుల్లో బిజెపిని ప్రజలు ఊడగొట్టడం ఖాయమని అన్నారు.
ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి జిల్లా కార్యదర్శి ఉమామహేష్ పాల్గొని మాట్లాడుతూ బిజెపి మరియు నరేంద్ర మోడీ ఎన్నికల్లో వస్తున్న విజయాలను చూసి గర్వంతో తాము ఏమి చేసినా ప్రజలు తిరగబడరని నియంతృత్వ పోకడలకు పోయి అనేక ప్రజావ్యతిరేక విధానాలను అవలంబించడం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయి అంతిమంగా బిజెపికి వ్యతిరేకంగా పోరాడడం ప్రారంభించారని దానికి నిదర్శనమే ఢిల్లీలో జరిగిన విద్యార్థి ఉద్యమం అని అన్నారు విద్యార్థి ఉద్యమంతో దిగివచ్చిన బిజెపి నరేంద్ర మోడీ అయోధ్య రామాలయంలో జరిగిన దొంగతనాన్ని గురించి మాట్లాడట్లేదని ఇదే వారికి రాముని పైన దేవుని పైన హిందుత్వం పైన ఉన్న ప్రేమను చూపిస్తుందని విమర్శించారు. నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం విద్యార్థి యువజన కార్మిక వ్యతిరేక విధానాలతో పాటు దేవుని వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఇదే వారి ఓటమికి నాంది అని ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారని వచ్చే ఎన్నికల్లో బిజెపికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధమయ్యారని దాన్ని సిపిఐ నాయకత్వం మరియు కార్యకర్తలు గ్రహించి తమ ప్రచారాలను మరింతగా పెంచడానికి దేశవ్యాప్తంగా ఈ ప్రచార యాత్రలను ప్రారంభించింది అని అన్నారు ఈ ప్రచార యాత్రలో దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు జిల్లాల్లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమానికి ఏ మండల కార్యదర్శి స్వామి అధ్యక్షత వహించగా సహాయ కార్యదర్శులు హరినాథ్ రావు, రాములు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ ప్రజానాట్యమండలి అధ్యక్షులు బాబు,జిల్లా కౌన్సిల్ సభ్యులు నర్సింహారెడ్డి,శాఖ కార్యదర్శి బక్కరి మల్లేష్,సిపిఐ నాయకులు శ్రీనివాస్,మల్లేష్ మహేందర్,రమేష్,ప్రసాద్ నాయక్,భీమేష్,కనకయ్య,రమేష్,కిష్టయ్య,వీరయ్య,మజ్జి గౌరీ,పవన్ భీమేష్,లతో పటు వందలాది కార్యకర్తలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
