హర్ ఘర్ తిరంగా.. ప్రతి భారతీయుడు లో దేశభక్తి..
దేశభక్తిని చాటుతూ హిందూ ముస్లిం భాయ్ భాయ్ నినాదాలతో బైక్ ర్యాలీ
ముస్లిం మైనార్టీ నాయకులు
జమియ తుల్ ఉలమా హింది కోవూరు మండలం మైనార్టీ నాయకులు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం మజీద్ ఆమీన్ మసీదు స్టవ్ బిడి కాలనీ నుండి కోవూరు తాలూకా ఆఫీస్ వరకు ఘర్ తిరంగా ర్యాలీ మైనార్టీ నాయకులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ నివాదాలతో,జాతి ఐక్యతను చాటారు. అనంతరం వీరు మాట్లాడుతూ.. ముఖ్య ఉద్దేశం భిన్నత్వంలో ఏకత్వం స్వాతంత్రం రాకముందు మనం ఎన్నో కష్టాలను అనుభవించామని స్వాతంత్రం తీసుకురావడానికి ఎందరో ప్రాణ త్యాగాలు చేశారని వారందరి కష్టమే ఈనాడు మనం స్వాతంత్రం దినోత్సవం జరుపుకుంటున్నామని మనందరం భిన్నత్వంలో ఏకత్వంగా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండాలని హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ నినాదాలతో ఈ ర్యాలీని నిర్వహించామని ప్రతి ఒక్కరూ ఈ పండుగను చేసుకోవాలని మనందరం ఈ సందర్భంగా ఆ మహనీయుల జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలని వారు తెలిపారు. అనంతరం ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలోజమియ తుల్ ఉలమా అధ్యక్షులు మౌలానా సౌద్ అహ్మద్, మండల సెక్రెటరీ షమీం, మౌలానా ముస్తాక్, మైనార్టీ నాయకులు సయ్యద్ మసూద్, షేక్ .జమీర్, సయ్యద్ రఫీ, షేక్. నాసిర్, ఎండి నసీద్, ఎస్. డి. దత్తగిరి, షేక్ .నయాజ్, పటాన్ నాసిక్, మరియు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
