ఏఐటీయూసీ నాలుగో జిల్లా మహాసభలకు కార్మికులు భారీగా తరలిరావాలి….
కరపత్రాలు ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు వై.వి.రావు, ప్రధాన కార్యదర్శి కడారి సునీల్….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి,
పెద్దపల్లి జిల్లా ఏఐటీయూసీ నాలుగో మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కామ్రేడ్ వై.వి.రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కడారి సునీల్ కార్మికులు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సుల్తానాబాద్ కేంద్రంగా ఈ నెల 20న నిర్వహించనున్న మహాసభలకు సంబంధించిన కరపత్రాలను రత్నాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో సెంటనరీ కాలనీలోని ఏఐటీయూసీ కార్యాలయంలో వారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై భవిష్యత్లో చేపట్టాల్సిన ఆందోళనలు, ఉద్యమ కార్యాచరణను జిల్లా మహాసభలో రూపొందించనున్నట్లు తెలిపారు. కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో మహాసభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
మహాసభకు సీపీఐ జాతీయ నాయకులు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ కలవేన శంకర్, ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బాలరాజు, ప్రవీణ్ కుమార్, తాండ్ర సదానందం తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు.
కార్మికుల హక్కులు, సమస్యలపై భవిష్యత్ పోరాటాలకు దిశానిర్దేశం చేసేలా మహాసభను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రత్నాపూర్ మండల ఏఐటీయూసీ నాయకులు జూపాక రామచందర్, ఎంఆర్సీ రెడ్డి, సంపత్, సాంబశివరెడ్డి, గంగాధర్, జి.భూమయ్య, మొండయ్య తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
