సహారా బాధితులకు అండగా ఎంపీ వంశీకృష్ణ…
డిపాజిటర్లకు న్యాయం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి…
సహారా బాధితుల నిరసనకు సంఘీభావం తెలిపిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, న్యూఢిల్లీ/
సహారా సంస్థలో డిపాజిట్ చేసిన తమ కష్టార్జిత సొమ్మును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ హాజరై బాధితులకు సంఘీభావం తెలిపారు.
దేశవ్యాప్తంగా వచ్చిన డిపాజిటర్లు, ఏజెంట్లు, మద్దతుదారులతో కలిసి నిరసనలో పాల్గొన్న ఎంపీ వంశీకృష్ణ, బాధితుల సమస్యలను తెలుసుకుని వారితో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా తమ సొంత డబ్బు కోసం ఎదురు చూస్తున్న సహారా డిపాజిటర్ల సమస్యను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రజల కష్టార్జిత సొమ్ము వారికి సకాలంలో అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని, బాధితుల ఆవేదనను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, అన్యాయానికి గురైన ప్రతి వర్గానికి అండగా నిలవడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని స్పష్టం చేశారు.
ఎంపీ గడ్డం వంశీకృష్ణ నిరసన కార్యక్రమంలో పాల్గొని మద్దతు ప్రకటించడం తమకు ధైర్యాన్ని, నమ్మకాన్ని కల్పించిందని సహారా బాధితులు, డిపాజిటర్లు అభిప్రాయపడ్డారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
