ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తి: ఎస్పీ నరసింహ
సాక్షిత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో|
తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తిప్రదాత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
తెలంగాణ ప్రాంత ప్రజల హక్కులు, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం ఆయన జీవితాంతం నిరంతరం కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు ఉద్యమానికి సిద్ధాంతపరమైన దిశానిర్దేశం చేయడంలో ప్రొఫెసర్ జయశంకర్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. తెలంగాణ సమాజానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మగ్దుం అలీ, ఆర్ఐ జానయ్య, ఆర్ఎస్ఐలు సురేష్, రాజశేఖర్, సాయిరాం, అన్వర్, అశోక్, సీసీ సందీప్‌తో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘనంగా నివాళులర్పించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
