ఈనెల 6న కోవూరులో భారీగా వైసీపీ ఆధ్వర్యంలో డీఎస్సీ పై నిరసన.
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు..
డీఎస్సీ లో అన్ని అవకతవగలే డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం దగా డీఎస్సి ని నిర్వహించిందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు అన్నారు. కోవూరులో వైసీపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని అబద్ధపు వాగ్దానాలు చేసి ఒకటి అమలు చేయకుండా, నిరుద్యోగులు నీ ఉద్యోగులని మోసం చేస్తూ భారీ అవినీతితో మెగా డీఎస్సీ నిర్వహించారు అన్నారు. అలాగే నిరుద్యోగ భృతి ఇస్తానని ఇంతవరకు దాని ఊసే లేదు అన్నారు.
నిరుద్యోగులు ఉద్యోగులకు మద్దతుగా వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు కోవూరులో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు నిరసన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ర్యాలీలలో విద్యార్థులు, ఉద్యోగుల తో పాటు యువత భారీ ఎత్తున మద్దతు తెలిపి ఢిల్లీని తలపించేలా కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు ప్రజలకు ఎప్పుడూ మద్దతుగా వైసిపి ఉంటుందని తెలిపారు. ఈకార్యక్రమంలో వైసీపీ నాయకులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, కొండూరు అనిల్ బాబు, శివుని నరసింహులు రెడ్డి, రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి,నలుబోలు సుబ్బారెడ్డి, మావులూరు శ్రీనివాసులు రెడ్డి, అత్తిపల్లి అనూప్ రెడ్డి, నవీన్ రెడ్డి, శేషగిరిరావు, సతీష్ రెడ్డి, గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి, షేక్. సాహుల్, యెడం లక్ష్మి కుమారి, కూట్ల ఉమా శ్రీనివాసులు, తురక భాస్కర్, తోడేటి మహేష్, గుణ్ణం జనార్ధన్, గోడ మోషే, మావులూరు వెంకటరమణారెడ్డి,సరాబు వెంకట సుధీర్ కుమార్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
