బుచ్చిలో అభివృద్ధి పనులు చైర్పర్సన్ మోర్ల సుప్రజ.
మున్సిపల్ కార్యాలయంలో అత్యవసర సమావేశం.
బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలోని మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి అధ్యక్షతన అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ అత్యవసర సమావేశంలో మొత్తం 23 అజెండాలను ప్రవేశపెట్టగా, వీటిలో 22 అజెండాలనుఆమోదించడం జరిగిందని,1అజెండాను వాయిదా వేయడం జరిగిందని తెలియజేశారు. 22 అజెండాలను ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిలర్స్ కు ధన్యవాదాలుతెలియజేశారు.
అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని నేషనల్ హైవే రోడ్డుకి సుమారు మూడు కిలోమీటర్లు రోడ్డుకి ఇరువైపులా, శాశ్వత పరిష్కారంగా డ్రైన్, ఫుట్ పాత్, మరియు సీసీ రోడ్ల ఏర్పాటు చేయడం కోసం మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 14 కోట్ల 40 లక్షల రూపాయల నిధులు తీసుకొచ్చారు, అతి త్వరలో పనులు కూడా ప్రారంభమవుతాయని, ఈ సందర్భంగా బుచ్చిరెడ్డిపాళెం ప్రజల తరఫున, కౌన్సిల్ తరఫున, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాననిఆమె తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఇనమల చినబాబు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది, పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
