భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కి ఏర్పాట్లు పూర్తి
పర్యావరణ చైర్మన్ రెడ్డి దినేష్ రెడ్డి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర ప్రజలకు అంకితం చేయనున్న ఈ చారిత్రాత్మక సందర్భం ఎంతో గర్వకారణం. ఈ మహోత్సవానికి సాలూరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు హాజరుకానున్నారు.ఈ నేపథ్యంలో, సాలూరు శాసనసభ్యులు మరియు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో, సాలూరు టౌన్, సాలూరు రూరల్, మక్కువ, పాచిపెంట, మెంతాడు మండలాలకు చెందిన అధికారులు, నాయకులతో కలిసి సమగ్రంగా ఏర్పాట్లను వీక్షించి,నియోజకవర్గం నుండి వెళ్తున్న ప్రతి ఒక్కరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా భోజనం మరియు ఇతర అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాము. గజపతి నగరం ఎ యం సి మార్కెట్ యార్డ్లో భోజన ఏర్పాట్ల కోసం స్థలాన్ని కేటాయించి, అక్కడ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాము.ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి నాయకులు, కార్యకర్తలు అందరూ ఐక్యంగా పనిచేయాలని కోరుతున్నాను. కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి సందేశాన్ని వీక్షించి, క్షేమంగా వెళ్లి క్షేమంగా తిరిగి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
