సామాజిక కార్యకర్త, టీడీపీ సీనియర్ నేతను పరామర్శించిన ప్రశాంతమ్మ
కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్థానికంగా పలువురిని పరామర్శించారు. కోవూరు శాంతినగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త దేవిరెడ్డి సురేష్ రెడ్డి కి ఇటీవల జరిగిన ప్రమాదంలో కాలు విరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయన నివాసానికి వెళ్లారు. సురేష్ రెడ్డి ని పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ప్రమాదం జరిగిన తీరును, వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం, ఇటీవల పాముకాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొంది, ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏకుల పరంధామి రెడ్డి ని కూడా ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి యోగక్షేమాలను ఆరా తీశారు. అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే సీనియర్ నేతలకు తాము ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని, ఏ అవసరమున్నా వెంటనే సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు. వారితో కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, ఇంతామల్లారెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
