హరితో దయ”ప్లాంటేషన్”
విద్యార్థులకు చెట్లు చేసే మేలు గురించి అవగాహన
ప్రధానోపాధ్యాయురాలు షేక్. అస్మత్ బేగం
కోవూరు శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్లో “గ్రీన్ ఇండియా మిషన్ హరితో దయ” కార్యక్రమం ప్రధానోపాధ్యాయురాలు షేక్. అస్మత్ బేగం ఆధ్వర్యంలో “ప్లాంటేషన్” విద్యార్థులు, స్కూల్ ప్రాంగణంలో చెట్లు నాటే కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా మిషన్ హరితో దయ “ప్లాంటేషన్” విద్యార్థులకు ఇప్పటి నుంచే ఇలాంటి కార్యక్రమం మీద మంచి అవగాహన కలిగి ఉండాలి, అలాగేమనము, విద్యార్థులు, అవకాశం ఉన్న దగ్గర ఒక చెట్టు నాటితే అవి పెరిగే కొద్దీ ఆ చెట్టు కూడా పెరిగి భవిష్యత్తులో దాని వల్ల ఉపయోగాలు, ఎన్నో లాభాలు ఎంత ప్రయోజనం ఉంటాయి.
కాలుష్యం నివారిస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, భారతదేశాన్ని గ్రీన్ ఇండియా హరితో దయ చేయాలని సంకల్పంతో అందరూ ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీన్ ప్రశాంత్, ప్రైమరీ ఇంచార్జ్ శైలజ, ప్రీ ప్రైమరీ ఇంచార్జ్ సంధ్య, పి. ఈ. టి. మాస్టర్ ఎస్ డి సమీర్, వంశీకృష్ణ షేక్. రషీద్, గణేష్, శ్యామల, కాంచన షమ్మపరహీన్, అపూర్వ, సుధాకర్,హాబిబున్నిసా, నీలవేణి, రమ్య, విద్యార్థులు పాల్గొనడం జరిగింది..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
