దివ్యాంగులు పి.ఎం దక్ష యోజనలో వివరాలు నమోదు చేసుకోవాలి……….. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ వి రజిని
……
*సాక్షిత వనపర్తి :
వికలాంగులు పి.ఎం దక్ష యోజనలో వివరాలు నమోదు చేసుకోవాలి అని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి వి రజని వికలాంగులను కోరారు . సోమవారం వనపర్తి జిల్లలోని పెబ్బేరు మండలంలో వికలాంగుల పునరావాస కేంద్రంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని వికలాంగులకు చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి రజని మాట్లాడుతూ మానసిక మరియు శారీరక బాల దివ్యాంగులను పునరావాస కేంద్రాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. అదేవిధంగా దివ్యాంగ్ జన్ రోజ్ గర్ సేతు, దివ్యాంగ్ జన్ కౌశల్ వికాస్ పథకాల గురించి వివరించారు. దివ్యాంగులు అందరికీ కూడా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవలు అందిస్తామని తెలియజేశారు. ఉచిత న్యాయ సలహాల కొరకు 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చు అని తెలియజేశారు. అదేవిధంగా పెబ్బేర్ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి వి రజని విద్యార్థులకు బాల్య వివాహాల నిషేధ చట్టం, బాల కార్మికుల నిర్మూలన చట్టం, మోటార్ వాహనాల చట్టం, ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు చట్టం, ఫోక్సో చట్టం గురించి అవగాహన కల్పించారు. మరియు పెబ్బేర్ లోని మహాత్మ జ్యోతి బాపూలే పాఠశాలను సందర్శించి పాఠశాలలో లీగల్ లిటరసీ క్లబ్ ను ప్రారంభించి క్లబ్ లో ఉన్న ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు నిర్వర్తించవలసిన కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమాలలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, కళాశాల ప్రధానోపాధ్యాయులు ఓబుల్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత మరియు పారా లీగల్ వాలంటీర్లు సుశీల, శేఖర్ చారి పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
