ముఖ్యమంత్రి చేతుల మీదుగా నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరి ప్రారంభం, రిఫైనరీ యూనిట్ కి శంకుస్థాపన…
ప్రజా పాలన రైతు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రోజున సిద్దిపేట జిల్లాలో నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరి ప్రారంభోత్సవంతోపాటు రిఫైనరీ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన మరియు రూ.775.72 కోట్లతో జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర మంత్రులు మరియు సహచర శాసనసభ్యులతో కలిసి పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణా రావు
ప్రజా పాలన రైతు ఉత్సవాలు వేదికగా ఈరోజు రూ.3600 కోట్లు మొదటి విడత రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి గారు విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు , పొన్నం ప్రభాకర్ గౌడ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ,దామోదర రాజనరసింహ , వివేక్ వెంకటస్వామి మరియు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి , మెదక్ ఎంపీ రఘునందన్ రావు మరియు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY