నిరుపేద ముస్లింలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన ………టీజే ఎస్ సి జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాషా
సాక్షిత వనపర్తి
ముస్లింల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పండగ వేల పేద ముస్లిం కుటుంబాలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని జకాత్ ద్వారా ఎంపిక చేసిన నిరుపేద కుటుంబాలకు బియ్యం కందిపప్పు గోధుమపిండి మంచి నూనె శనిగలు చక్కెర వంటి నిత్యవసర సరుకులను తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాషా ఆధ్వర్యంలో సరుకులతో కూడుకున్న కిట్టును జేఏసీ నాయకులతో కలిసి పంపిణీ చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా జకాత్ ద్వారా ఎంపిక చేయబడిన పేద నిరుపేద ముస్లింలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరుగుతోందని అసలు రంజాన్ మాసం దానధర్మాలకు త్యాగానికి ప్రతీక అని సమాజంలో ఆకలితో ఉన్నవారికి సాయం చేయడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని అదే ఆశయంతో తన వంతు బాధ్యతగా ప్రతి సంవత్సరం పండగపూట ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్న ఆశయంతోనే 250 మంది కి ఇలాంటి సేవలను అందిస్తున్నామని భవిష్యత్తులో కూడా మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతుందని ఖాదర్ పాషా ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో టీజే ఎస్సీ నాయకులు కార్యకర్తలు జేఏసీ నాయకులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY