GWMC శానిటేషన్ పనుల కోసం 250 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకానికి కోసం సీఎం రేవంత్ రెడ్డి కి వినతి పత్రం అందజేసిన మంత్రి సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు, మేయర్ సుధారాణి…
హైదరాబాద్ జిల్లా..
హైదరాబాద్ అసెంబ్లీ ప్రాంగణంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్ మరియు ఇతర పనుల నిర్వహణకు 250 మంది సిబ్బందిని ఔట్సోర్సింగ్ విధానంలో నియమించేందుకు మంజూరు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని కలిసి, సంబంధిత ఫైల్ ప్రస్తుతం మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల వద్ద ఉన్నందున, దానిని ఈ మార్చ్ నెలాఖరు నాటికి ఆమోదించాలని అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి కలిసి వినతిపత్రం అందజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు …
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, ఈ నెలాఖరు నాటికి మంజూరు కల్పించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు….

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY