మార్చి 24 లోపు ఎస్సీ యువతీ యువకులు, వార్షిక ప్రణాళిక దరఖాస్తులు సమర్పించాలి…
-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…
సాక్షిత పెద్దపల్లి/
మార్చి 24 లోపు ఎస్సీ యువతీ యువకులు, వార్షిక ప్రణాళిక దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ ఎస్సీ యువతీ యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పలు పథకాలను ఆమోదించిందని అన్నారు. 2025-26 వార్షిక ప్రణాళికకు సంబంధించి 90 శాతం సబ్సిడీ 10 శాతం బ్యాంకు లోన్ తో లక్ష రూపాయల విలువ గల 100 టూ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలు, 70 శాతం సబ్సిడీ, 30 శాతం బ్యాంకు లోన్ తో 3 లక్షల రూపాయలు విలువ గల 71 త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలు, 7 లక్షల రూపాయలు విలువ గల 15 సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్ సెట్ లను పెద్దపల్లి జిల్లాకు ప్రభుత్వం కేటాయించిందని అన్నారు.
వ్యవసాయేతర పథకాలకు 21 నుంచి 50 సంవత్సరాల వయసు, వ్యవసాయ పథకాలకు 21 నుంచి 60 సంవత్సరాల వయసు ఉండాలని, అభ్యర్థులు ఆధార్ కార్డు రేషన్ కార్డు కుల ధ్రువీకరణ పత్రం, ఆధాయ ధృవీకరణ పత్రం (గ్రామీణ ప్రాంతాలలో సంవత్సరానికి లక్ష 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల) మించి ఉండకుండా ఉండాలని, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా రంగ పథకాలకు) , పట్టాదారు పాసు పుస్తకం (సోలార్ పంప్ సెట్ కోసం కనీసం రెండు ఎకరాల భూమి ఉండాలని) దివ్యాంగ అభ్యర్థులు అయితే సదరం సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తో అభ్యర్థులు తమ దరఖాస్తును నమోదు చేయాలని అన్నారు.
నిరుద్యోగ ఎస్సి యువతీ యువకులు మార్చి 24 లోగా తమ దరఖాస్తులను ఆన్ లైన్ పోర్టల్ https://tgobmms.cgg. gov.in లో నమోదు చేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY