రూ.9 కోట్లతో త్వరలో అభివృద్ధి పనుల ప్రారంభం : ప్రత్తిపాటి
- గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నుంచి రూ.18 కోట్ల పనులకు పాలనా అనుమతులు.
- వర్షాకాలం నాటికి పట్టణవ్యాప్తంగా సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణం పూర్తికావాలి.
- 8వ వార్డులో రూ.16.20లక్షలతో నిర్మించిన సీసీరోడ్డు, డ్రైన్లను ప్రారంభించిన ప్రత్తిపాటి.
త్వరలోనే రూ.9కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నామని, నియోజవకర్గంలోని గ్రామాల్లో తాగునీటి కోసం ప్రభుత్వం రూ.18కోట్లతో పాలనా అనుమతులు మంజూరు చేసిందని, పనిచేసే ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంటే అభివృద్ధి, సంక్షేమం ఎలా జరుగుతాయో కూటమిప్రభుత్వ పనితీరే పెద్ద ఉదాహరణ అని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.
పట్టణంలోని 8 వ వార్డులో రూ.16.20 లక్షలతో నిర్మించిన సీసీరోడ్డు, డ్రైన్లను కూటమి నాయకులతో కలిసి శుక్రవారం ప్రత్తిపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణంలో ఎక్కడా రోడ్లు, డ్రైన్ల సమస్య ఉత్పన్నం కాకూడదని, ప్రజలకు అసౌకర్యం లేకుండా మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వీధిలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ ల నిర్మాణం చేపట్టాలని ప్రత్తిపాటి సూచించారు. వర్షాకాలం నాటికి పట్టణంలోని సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులన్నీ పూర్తయ్యేలా మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని, తాగునీటి సమస్య పరిష్కారానికి ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించారు.
కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, బీజేపీ నాయకులు జయరాం రెడ్డి, టీడీపీ నాయకులు మద్దిబోయిన శివ, అమరా రమాదేవి, కొత్త కోటేశ్వరరావు, ముల్లా కరీముల్లా, మురకొండ మల్లిబాబు, మున్సిపల్ కౌన్సిలర్లు బేరింగ్ మౌలాలి, కొత్త కుమారి, కునాల ప్రమీల, లక్ష్మీ తిరుమల, జంగా సుజాత, కంచర్ల కరుణ, వార్డు నాయకులు గంగాధర్, సుబ్బారావు, ఆలపాటి వెంకట్రావు, గోరంట్ల శ్రీను, హరిబాబు రెడ్డి, కూటమి నాయకులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY