శంకర్‌పల్లి మున్సిపాలిటీలోని అన్ని లేఅవుట్ లలో రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు తొలగించాలని చేవెళ్ల ఎమ్మెల్యేకు బిజెపి నాయకుల వినతి
శంకర్‌పల్లి: సాక్షిత): శంకర్‌పల్లి మున్సిపాలిటీలోని 15 వార్డులలో గల అన్ని లేఅవుట్ లలో రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు తొలగించాలని మున్సిపల్ కార్యాలయంలో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్యకు మున్సిపల్ మండల, బిజెపి నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ఈనెల 11న 14వ వార్డు కాలనీ యందు మండల బిజెపి మహిళ అధ్యక్షురాలు గండేటి గాయత్రి రమేష్ గౌడ్ ఇంటి ఆవరణలోని బాత్రూం ను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు అక్రమంగా కూల్చివేశారు. అదేవిధంగా బాత్రూం పక్కన ఉన్న వేరే ఇంటి మెట్లను కూల్చలేదు.
పట్టణ పరిధిలో ఉన్న అన్ని వెంచర్లే అవుట్ ప్రకారం రోడ్లకు ఇరువైపులా ఉన్న అక్రమంగా నిర్మించిన వాటిని వెంటనే తొలగించాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు లేనిపక్షంలో బిజెపి తరఫున పెద్ద ఎత్తున మున్సిపల్ పరిధిలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. అక్రమంగా నిర్మించిన వాటిని మున్సిపల్ అధికారులు గుర్తించి వెంటనే తొలగించి ప్రజలందరికీ న్యాయం చేయాలని బిజెపి నాయకులు ఎమ్మెల్యేను కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ వైస్ చైర్మన్ శ్వేతా పాండురంగారెడ్డి బిజెపి సీనియర్ నాయకులు కాలనీవాసులు ఉన్నారు.


SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY