హత్యాయత్నం కేసులో బాల నిందితులకు తీర్పు
18 నెలలు సంస్కరణ గృహానికి పంపాలని కోర్టు ఆదేశం
సూర్యాపేట జిల్లా ప్రతినిధి:
కేతేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్యాయత్నం కేసులో నలుగురు బాల నిందితులను దోషులుగా తేల్చుతూ నల్గొండ జువెనైల్ జస్టిస్ బోర్డు కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితులను 18 నెలలపాటు హైదరాబాద్‌లోని ప్రత్యేక బాల సంస్కరణ గృహంలో ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి Cr.No.29/2020, JCC.No.83/2022 కింద విచారణ జరిపిన నల్గొండ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మరియు జువెనైల్ జస్టిస్ బోర్డు న్యాయమూర్తి కె. శిరీష నిందితులు చేసిన నేరాలను పరిశీలించి వారికి శిక్ష విధించారు. కేతేపల్లి మండలానికి చెందిన నలుగురు బాల నిందితులు ఐపీసీ సెక్షన్లు 120(B), 143, 147, 148, 324, 307, 301 r/w 149 కింద నేరానికి పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది.
ఈ నేపథ్యంలో నిందితులను హైదరాబాద్‌లోని స్పెషల్ హోమ్ ఫర్ బాయ్స్ (Special Home for Boys) కు తరలించి 18 నెలలపాటు అక్కడ ఉంచాలని ఆదేశించింది. సంస్కరణ గృహంలో ఉండే కాలంలో వారికి విద్య, నైపుణ్యాభివృద్ధి, కౌన్సెలింగ్, ప్రవర్తనా మార్పు కార్యక్రమాలు adevishangaa సంస్కరణాత్మక సేవలు అందించాలని కోర్టు పేర్కొంది. అలాగే ఐపీసీ సెక్షన్లు 143 మరియు 324 కింద ఒక్కొక్కరికి రూ.2000 చొప్పున జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఒక నెలపాటు సంస్కరణ గృహంలో ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్. కృష్ణయ్య వాదనలు వినిపించారు. కేసును దర్యాప్తు చేసిన అప్పటి ఎస్.ఐ బి. రామకృష్ణ, సీఐ పి.ఎన్.డి. ప్రసాద్, సీఐ ఎస్. రాఘవరావు కీలక ఆధారాలు సమర్పించారు. ప్రస్తుతం ఎస్‌డీపీఓ కె. శివరాం రెడ్డి, శాలిగౌరారం సర్కిల్ సీఐ కె. కొండల్ రెడ్డి, కేతేపల్లి ఎస్‌హెచ్ఓ యు. సతీష్,కోర్ట్ కానిస్టేబుల్ కిరణ్‌లను జిల్లా ఎస్పీ అభినందించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY