చిన్నారి శివ్ కార్తివన్ అన్నప్రాశన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

Sakshitha news

చిన్నారి శివ్ కార్తివన్ అన్నప్రాశన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …

చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామంలో పాశం శ్రీ హర్ష – శివాని దంపతుల కుమారుడు చిన్నారి పాశం శివ్ కార్తివన్ అన్నప్రాశన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ శుభకార్యానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్, హన్మకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ తో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం చిన్నారి శ్రీశివ్ కార్తివన్‌కు అన్నప్రాశన వేడుక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చేలా ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. అలాగే పాశం హర్ష – శివాని దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి కుటుంబంలో ఎల్లప్పుడూ సంతోషాలు, ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి, వేడుకలో కొంత సమయం గడిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, జిల్లా ఎస్సీ సెల్ చైర్మెన్ సిలువేరు శ్రీనివాస్, 56వ డివిజన్ అధ్యక్షులు కొంకా హరిబాబు,14వ డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్, ఐనవోలు మండల అధ్యక్షులు నకరకంటి మోహన్ గౌడ్, హన్మకొండ జిల్లా జెబిఎం చైర్మెన్ జన్నపురెడ్డి రుగ్విద్ రెడ్డి, కల్లెడ PACS చైర్మెన్ పిన్నింటి అనిల్ రావు, మల్లారెడ్డిపల్లి పిఎసిఎస్ చైర్మన్ కుమారస్వామి,వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు శివరాం,సీనియర్ నాయకులు, కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.