కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపడుతున్న దీక్షకు సంఘీభావం తెలిపిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ .
కంటోన్మెంట్ బోర్డును జిహెచ్ఎంసి లో విలీనం చేయాలన్న డిమాండ్ తో ఐదు రోజులుగా దీక్ష నిర్వహిస్తున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ మద్దతు తెలిపారు. శ్రీగణేష్ చేపడుతున్న దీక్షా శిబిరం వద్దకు వెళ్లిన కూన శ్రీశైలం గౌడ్ .. తన సంఘీభావని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటోన్మెంట్ ను జిహెచ్ఎంసిలో విలీనం చేయాలన్న డిమాండ్ న్యాయ సమ్మతమైనదన్నారు. కంటోన్మెంట్లో నివసిస్తున్న ప్రజలకు సకాలంలో ఇంటి అనుమతులు, తాగు నీరు, రోడ్లు, డ్రైనేజీ తదితర కనీస మౌలిక వసతులకు పొందాలంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితిలో ఏర్పడ్డాయి అన్నారు, కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి జిహెచ్ఎంసిలో కంటోన్మెంట్ నియోజకవర్గానికి జిహెచ్ఎంసిలో విళినం చేయాలను డిమాండ్ చేశారు.
ఒకప్పుడు నగరానికి శివారులో కంటోన్మెంటు ఉండేదని, ఇప్పుడు నగర విస్తరణతో జిహెచ్ఎంసిలో భాగమైందన్నారు. కంటోన్మెంట్ ను జిహెచ్ఎంసి లో విలీనం చేసే వరకు జరిగే పోరాటంలో, నా సంపూర్ణ మద్దతు ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ కూడా అండగా ఉంటుందన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY