292 డివిజన్, సాయిబాబా నగర్ పరిధిలోని తెలుగు తల్లి నగర్

Sakshitha news

292 డివిజన్, సాయిబాబా నగర్ పరిధిలోని తెలుగు తల్లి నగర్ లో నెలకొన్న పలు సమస్యలపై బస్తీలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది.

ఈ పాదయాత్రలో BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ ప్రజలతో మమేకమై, వారి ఇళ్ల దగ్గరికి స్వయంగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సమస్యలన్నింటినీ కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లి, తగిన అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో BRS నాయకులు రాజ్ కుమార్ ముదిరాజ్ మరియు తెలుగు తల్లి నగర్ ప్రెసిడెంట్ తారా సింగ్, కరాటే శీను, బద్రి, జహీర్, నారాయణ, కాసా రాధాకృష్ణ, లక్ష్మణ్ తో పాటు పలువురు నాయకులు, బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.