రాష్ట్రవ్యాప్తంగా “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” కార్యక్రమం
ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలి
రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమక్షంలోనే సమగ్ర భూ సర్వే
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం
ఈరోజు మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని భూ సర్వే, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, హౌసింగ్ శాఖలకు సంబంధించిన అనేక అంశాలపై శాసనసభ స్పీకర్ Gaddam Prasad Kumar గారు, సహచర మంత్రి Duddilla Sridhar Babu గారు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి, శాసనసభ సభ్యులతో కలిసి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి అధికారులతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి మరియు వికారాబాద్ జిల్లాలకు సంబంధించి పలు సమస్యలను ప్రజా ప్రతినిధులు ప్రస్తావించారు. ప్రధానంగా రైతుల ప్రయోజనాల కోసమే చేపట్టిన భూముల రీసర్వే వారి సమక్షంలోనే చేసి భూ సమస్యల పరిష్కరించాలని అధికారులను ఆదేశించాను. అదే విధంగా రీసర్వే జరిగే గ్రామాల్లో ప్రతిరోజు తహశీల్దార్లు పర్యటించాలి. ఆర్డీవో, అదనపు కలెక్టర్లు, కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించడమేగాక కనీసం వారానికోరోజు రీసర్వే జరిగే గ్రామాలకు వెళ్లాలని సూచించడం జరిగింది.
రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు, పట్టా భూములకు సంబంధించిన సమస్యలు, భూముల హద్దులపై నెలకొన్న వివాదాలు వంటి అంశాలను కూడా సమగ్ర సర్వే ద్వారా గుర్తించి పరిష్కరిష్కరించాలి. 22ఎ కు సంబంధించి ఇప్పటివరకు ఇచ్చిన జీవోలు, మెమోలతో పరిష్కారం కానీ అంశాలు ఏమైనా ఉంటే పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను.
రాష్ట్రవ్యాప్తంగా “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి”
అంతకుముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించడం జరిగింది.
పేదల ఆత్మగౌరవానికి చిహ్నమైన ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలన్న సంకల్పంతో ప్రజాప్రభుత్వం తొలివిడత మంజూరు చేసిన 4.50 లక్షల ఇండ్లలో ఇప్పటికి 2,21,500 గృహప్రవేశాలు పూర్తయ్యాయి. ఈ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ప్రతి పేద కుటుంబంలో ఆనందాల వెలుగులు నిండి, ప్రతి ఇందిరమ్మ ఇంటి గడపలో దీపావళి కాంతులు విరజిమ్మాలని “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు గృహప్రవేశాలు జరుపుకున్న ఇందిరమ్మ ఇళ్లలో ఈ దీపావళి రోజున ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ భాగస్వాములై మాఇందిరమ్మ ఇంట్లో దీపావళి అనే వేడుకను లబ్దిదారులతో కలిసి కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించాలని సూచిస్తున్నాను..
రాష్ట్రంలో అర్హులైన ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాలన్నదే ఇందిరమ్మ ప్రభుత్వ సంకల్పం.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
