మణుగూరు డిపో మహిళా కండక్టర్ ప్రవళిక మృతి

Sakshitha news

మణుగూరు డిపో మహిళా కండక్టర్ ప్రవళిక మృతి

ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం…
ఆర్టీసీ యాజమాన్యం అండగా ఉంటుంది

  • ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం.
  • ఇందిరమ్మ ఇల్లు మంజూరు.
  • ప్రభుత్వం & ఆర్టీసీ నుంచి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా.
  • ఆర్టీసీ నిర్ణయం మేరకు బ్యాంకు ద్వారా రూ.1 కోటి ప్రమాద బీమా.

ఇటీవల ప్రయాణికులతో జరిగిన వివాదంలో బస్సు టైర్ల కింద పడి తీవ్రంగా గాయపడిన మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక, హైదరాబాద్‌లోని సాయి సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రవళిక తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్లు ,ప్రభుత్వం & ఆర్టీసీ నుండి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా, ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా బ్యాంకు నుండి కోటి రూపాయలు ప్రమాదా భీమా అందనుంది