మహిళా కండక్టర్ మృతి బాధాకరం
- ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి పొంగులేటి
ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రవళిక మృతి పట్ల రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.ప్రవళిక మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ప్రవళిక కుటుంబానికి ప్రజా ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
