ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి.. అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలి
నూతన కౌన్సిలర్లకు మాజీ ఎమ్మెల్సీ వై.వీ.బీ.రాజేంద్ర ప్రసాద్ దిశానిర్దేశం
**
ఉయ్యూరు మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు ఎమ్మెల్సీ వై.వీ.బీ. రాజేంద్ర ప్రసాద్ ని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో తమ విజయానికి సహకరించి, కృషి చేసిన రాజేంద్ర ప్రసాద్ కీ ధన్యవాదాలు తెలియజేశారు…**
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ నూతన కౌన్సిలర్లను అభినందించి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమకు అప్పగించిన బాధ్యతను గుర్తించి, వార్డుల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
“ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకమే మనకు బలం. పదవి కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలి. ప్రతి వార్డులో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలి. ఉయ్యూరు మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దాం” అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కౌన్సిలర్లు చొరవ చూపాలని ఆయన కోరారు. నూతన కౌన్సిలర్లకు మరోసారి శుభాకాంక్షలు తెలిపి, ప్రజాసేవలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నూతన కౌన్సిలర్లు బోర్ర సుబ్బారావు, పలియాల శ్రీనివాసరావు, రాజుల పార్టీ ఫణికుమార్, జంపాన చినబాబు, టిడిపి నాయకులు సయ్యద్ అజ్మతుల్లా, రాజుల పార్టీ ఫణి కుమార్, మురారి అయ్యా, జంపాన శివయ్య,, జంపానా నరసింహారావు, తేజ ,చిన్ని ,శంకర్, నాగేశ్వరరావు, టిడిపి నాయకులు, కార్యకర్తలు,పెద్ద ముఠా సభ్యులు తదితరులు పాల్గొన్నారు


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
