రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ఎన్‌ఆర్‌ఎస్ విద్యార్థిని ప్రతిభ

Sakshitha news

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ఎన్‌ఆర్‌ఎస్ విద్యార్థిని ప్రతిభ

బెస్ట్ ప్లేయర్ అవార్డు కైవసం


సూర్యాపేట జిల్లా/ కోదాడ సాక్షిత :
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్‌-17 వాలీబాల్ పోటీల్లో కోదాడ పట్టణంలోని ఎన్‌ఆర్‌ఎస్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తేజశ్రీ ప్రతిభ కనబరిచింది.

ఈ పోటీల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టుకు ఎంపికైన తేజశ్రీ, తన ఆటతీరుతో ఆకట్టుకుని బెస్ట్ ప్లేయర్ అవార్డును సొంతం చేసుకుంది.

ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో తేజశ్రీని కళాశాల చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాలరావు, ప్రిన్సిపాల్ జీ.వీ., వైస్ ప్రిన్సిపాల్ పి.ఎన్.ఆర్.తో పాటు పలువురు అధ్యాపకులు అభినందించారు.
తేజశ్రీ భవిష్యత్తులో…