కూటమి విజయంతో కోదాడలో తెదేపా శ్రేణుల సంబరాలు
సూర్యాపేట జిల్లా / కోదాడ, సాక్షిత :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘనవిజయం సాధించిన సందర్భంగా కోదాడ పట్టణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించాయి.
కోదాడ పట్టణ టీడీపీ అధ్యక్షుడు కట్టా సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు పార్టీ మాజీ ఇన్చార్జి ఓరుగంటి ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ, బాణాసంచా కాల్చి ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో కూటమి సాధించిన విజయం ప్రజల నమ్మకానికి, మద్దతుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ విజయం పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనూ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ‘జై తెలుగుదేశం’, ‘ఎన్టీఆర్ అమర్ హై’ అంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో గురవయ్య, బాలకృష్ణ, శోభన్ బాబు, రేవంత్ రెడ్డి, సురేష్, ఉపేందర్ గౌడ్, రాఘవయ్య, ఆశిష్, అనిల్, నాగేశ్వరరావు, వెంకట్రావు, మాధవరావు, ఆఫీజ్, ఆంజనేయులు, నవీన్ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
