మురసు తుఫానుపై మంత్రి తుమ్మల ఆరా …..
ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన మంత్రి తుమ్మల …..
రైతులు అప్రమత్తంగా ఉండాలి అని మంత్రి తుమ్మల సూచన….
మురసు తుఫాన్ ఎఫెక్ట్ పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్ తో మాట్లాడినారు. జిల్లాలో కురుస్తున్న వర్షపాత వివరాలతో పాటు రైతులు కు ఉన్న సమస్యలను మంత్రి తుమ్మల అధికారులకు వివరించారు.ఈ తుఫాన్ జిల్లాలో ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మంత్రి తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు సూచనలు చేశారు. ఈ తుఫాన్ ప్రభావంతో వరి పరిస్థితిని మంత్రి తుమ్మల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రధాన జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలు వివరాలను మంత్రి తుమ్మల అడిగి తెలుసుకున్నారు. ఈ తుఫాను తో ఎలాంటి నష్టం జరగకుండా క్షేత్రస్థాయి సిబ్బందిని అలర్ట్ గా ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వాలని మంత్రి తుమ్మల ఉన్నతాధికారులను ఆదేశించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
