రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న ఎం.ఎస్. రాజ్ ఠాకూర్…
సాక్షిత పెద్దపల్లి : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 25, 26, 27, 28, 29, 30 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రజలతో కలిసి లింగపూర్, విలేజ్ రామగుండం, రైల్వే స్టేషన్, రామగుండం ప్రాంతాల్లో నిర్వహించిన, కార్నర్ మీటింగ్‌లలో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,
కాంగ్రెస్ పార్టీ పాలనలోనే నిజమైన అభివృద్ధి సాధ్యమని, ప్రజా సమస్యలపై స్పష్టమైన దృష్టితో పనిచేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని రామగుండం అభివృద్ధికి గతంలో చేసిన పనులను గుర్తు చేస్తూ, రాబోయే రోజుల్లో మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.
ప్రజల నుండి లభిస్తున్న విశేష స్పందన కాంగ్రెస్ పార్టీపై ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధి బాటలో రామగుండాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY