అర్హులైన ప్రతి ఒక్కరు పట్టభద్రుల ఓటరు నమోదు చేసుకోవాలి – ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు , ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..
శేరిలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంపై బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు సంబంధిత నాయకులతో చందానగర్ మరియు మక్తా-మియాపూర్ డివిజన్ల ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కూకట్పల్లి నియోజకవర్గ శాసన సభ్యులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు , మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై నాయకులతో చర్చించి, అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. గత పట్ట భద్రుల ఓట్ల జాబితా ఆధారంగా పూర్తి వివరాలు సేకరించి అర్హులైన ప్రతి ఒక్కరు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నవంబర్ 6 చివరి తేదీ కావడంతో ఓటర్ నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం నాయకులు అభిమానులు కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.
మన ఇళ్లలోని పట్టభద్రులతోపాటు కాలనీ, డివిజన్ తో పాటు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరి ఇళ్లలో పట్టభద్రులను గుర్తించి ఓటర్ నమోదు చేపించాలి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల నమోదు ప్రక్రియ మొదట మన ఇంటి నుంచి ప్రారంభమవ్వాలి.
గతంలో ఓట్లు వేసిన పట్టభద్రులు కూడా తిరిగి ఓటర్ నమోదును చేపించుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలి.
రాష్ట్రంలో కెసిఆర్ నాయకత్వాన్ని తిరిగి 70 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని, ఎన్నికలెప్పుడు వస్తాయి, కేసీఆర్ ని మళ్లీ ముఖ్యమంత్రి ఎప్పుడూ చేస్తామని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
కానీ నేడు ప్రభుత్వ వైఫల్యాలు, పాలనలో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, యువతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్న తీరును ప్రజలకు వివరించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయానికి కృషిచేయాలన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపులో మంచి మెజారిటీ సాధించేలా నాయకులు, కార్యకర్తలకు కృషి చేయాలి.
ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు సంబంధిత నాయకులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
