తుపాన్ ప్రభావంతో ఒకరు మృతి, ఒకరికి గాయాలు బాధాకరం
- ఇరువురు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే అంజిబాబు
భీమవరం ;
తుపాన్ ప్రభావంతో ఒకరు మృతి చెందడం, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందడం ఇటువంటి ఘటనలు జరగడం చాలా బాధాకరమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. మన్నా చర్చ్ ఎదురుగా కరెంట్ పోల్, చెట్టు మృతి చెందిన చొక్కా కిషోర్ కుమార్ నివాసానికి ఎమ్మెల్యే అంజిబాబు చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అదే విధంగా బోండాడ విడిది ఇల్లు దగ్గర పి రాంబాబు మెడపై కరెంట్ పోల్, చెట్టు పడిపోవడంతో మెడ నరాలు దగ్గర తీవ్ర దెబ్బలు తగలడంతో భీమవరం ఆసుపత్రికి చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే అంజిబాబు ఆసుపత్రికి చేరుకుని రాంబాబును పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులకు పరామర్శించారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
