నితిన్ హోమ్ ఫర్నిచర్స్ షాపును ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

Sakshitha news

నితిన్ హోమ్ ఫర్నిచర్స్ షాపును ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ కి చెందిన గొలుసు సంతోష్ మడికొండలో నూతనంగా ఏర్పాటు చేసిన నితిన్ హోమ్ ఫర్నిచర్స్ షాపును వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి సాధించి, వినియోగదారులకు నాణ్యమైన ఫర్నిచర్‌ను అందిస్తూ మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.