ఎస్.ఆర్. నాయక్ నగర్ అభివృద్ధి పనులపై కీలక చర్చ
మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నె రాజు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీమతి శ్రీజన, IAS మేడం ని కలిసి ఎస్.ఆర్. నాయక్ నగర్ కాలనీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్.ఆర్. నాయక్ నగర్ సంపు స్థలాన్ని కాలనీ అభివృద్ధి పనుల కోసం వినియోగించుకునేందుకు సహకరించాలని మన్నె రాజు కమిషనర్ మేడం ని కోరడం జరిగింది. దీనిపై స్పందించిన కమిషనర్ మేడం , ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారితో చర్చించి తన వంతు సహకారం అందిస్తానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఆర్. నాయక్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ బాబి , మాజీ ప్రెసిడెంట్ టక్ శ్రీను , కిషోర్ , చంద్రకాంత్ గారు మరియు కాలనీకి చెందిన పలువురు పాల్గొన్నారు.
కాలనీ అభివృద్ధే లక్ష్యంగా.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా..


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
