కుత్బుల్లాపూర్ జోనల్ కార్యాలయం.. కుత్బుల్లాపూర్ నియోజక వర్గం
శ్రీయుత గౌరవనీయులైన
జోనల్ కమిషనర్IAS అధికారి పింకేష్ కుమార్ కి *కుత్బుల్లాపూర్ కి
*
ఆర్యా
విషయం: కొత్త పెన్షన్లు ఎంక్వయిరీలో లోపాలను సరి చేయాలని వినతి పత్రం అందజేసిన సీనియర్ BRS నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ …
సరైన డేటా లేకుండా పాత డేటా తో ఎంక్వైరీ చేయడం నిబంధనకు విరుద్ధం.
తమరితో విషయం తెలియజేయునది ఏమనగా గతంలో ప్రజాపాలన అంటూ దరఖాస్తులు తీసుకుని మళ్లీ కొన్ని రోజుల క్రితం మీ సేవలో అప్లై చేసుకోవాలని పెన్షన్ దారులను గందరగోళానికి గురిచేసిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో కొంతమంది అప్లై చేసుకున్నారు కొంతమంది చేసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు ఎంక్వైరీ పేరుతో సరైన డేటా లేకుండా పది సంవత్సరాల క్రితం ఉన్న డేటాను తీసుకొచ్చి మీకు ఇల్లు ఉంది పొలం ఉంది అంటూ ఒంటరి మహిళలను వితంతువులను ఎంక్వైరీ చేయడం ద్వారా వారికి ఎటువంటి ఆధారం లేకపోవడంతో గందరగోళానికి *గురవుతున్నారు. ప్రస్తుతం *ఉన్న డేటాతో వారిని ఎంక్వయిరీ చేసి వారికి పెన్షన్ మంజూరు చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే వికలాంగులు కూడా చాలా రోజుల నుంచి పెన్షన్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు వాటిలో కూడా ఎటువంటి లోపాలు లేకుండా శాంక్షన్ చేపించగలరని కోరుచున్నాము .
స్పందించిన జోనల్ కమిషనర్ గారు వెంటనే కుత్బుల్లాపూర్ జోనల్లో పరిధిలో ఉండే డిప్యూటీ కమిషనర్లతో మాట్లాడి సమస్య పరిష్కారం తీస్క కృషి చేస్తానని హామీ ఇచ్చిన IAS అధికారి పింకేష్
కుమార్ ….
పెన్షన్ ఎంక్వయిరీ లో కొంతమంది ఎంక్వయిరీ కోసం అమౌంట్ అడుగుతున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది *దాన్ని కూడా సరిచేయాలని కోరుచున్నాము.
ఎటువంటి ఆధారం లేని ఒంటరి మహిళలను వితంతువులను సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి ఆధారాలు తీసుకోవాలని చెప్పడంతో వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యని పరిష్కరించాలని జోనల్ కమిషనర్ ని కోరుతున్నాము.
ఈ యొక్క ఎంక్వయిరీ కి అవగాహన లేని సిబ్బందిని పెట్టి ప్రజలను ఆందోళనకు గురి చేయవద్దని తక్షణమే తమరు ఎంక్వయిరీ చేయాలని కోరుచున్నాను .
ఇట్లు
గుబ్బల లక్ష్మీనారాయణ


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
