ప్రగతి నగర్‌లో రూ.12 లక్షల సీఎంసీ నిధులతో సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Sakshitha news

ప్రగతి నగర్‌లో రూ.12 లక్షల సీఎంసీ నిధులతో సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ||*

276వ ప్రగతి నగర్ డివిజన్‌లోని జయ ఆర్కేడ్ నుంచి వింధ్య ప్రైడ్ వరకు సీఎంసీ నిధులు రూ.12 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

బొమ్ము వెంకటేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ శంకుస్థాపన కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.