ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే తొలగించాలి

Sakshitha news

ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే తొలగించాలి

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం — కలెక్టరేట్ ఎదుట హోరెత్తిన నిరసన

ఖమ్మం, :
ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని కాపాడేందుకు, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించాలనే డిమాండ్‌తో ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC) పిలుపుమేరకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన భారీ ధర్నా కార్యక్రమంలో కేకేసీ (KKC) నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కేకేసీ నాయకులు ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా, స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని వారు పేర్కొన్నారు.

“ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉండాలి.. ఓటు హక్కుకు రక్షణ ఉండాలి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి” అంటూ నాయకులు నినదించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం, నిష్పక్షపాత వైఖరి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యంలో ఓటు ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కు అని, ఆ హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని నాయకులు తెలిపారు. ప్రజల ఓటు హక్కు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రతను పరిరక్షించేందుకు కేకేసీ కార్మిక సంఘం కాంగ్రెస్ పార్టీతో కలిసి నిరంతరం ఉద్యమిస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కేకేసీ జిల్లా అధ్యక్షులు సిహెచ్ విప్లవ కుమార్ పటేల్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బొల్లిని నాగరాజు యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్ ఆటో యూనియన్ పార్లమెంట్ అధ్యక్షులు మెరుగు వెంకట నాయుడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి గాయస్ పాషా నగర అధ్యక్షులు బి సతీష్ త్రీ టౌన్ అధ్యక్షులు సిహెచ్ రాజు వీరా గౌడ్ ప్రభాకర్ నరసింహారావు శ్రీను బాలకృష్ణ వేణు గౌడ్ పాటు కేకేసీ జిల్లా నాయకులు, వివిధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.