శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆల్విన్ కాలనీ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ బండ కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం దగ్గర బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు తో కలిసి నివాళులు అర్పించిన మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు .
రంగారావు గారు మాట్లాడుతూ తెలంగాణ స్వాతంత్ర్య పోరాట యోధుడు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిప్రదాత, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాడారని ,నిజాం పాలన కాలంలో వెట్టి చాకిరీ, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన బాపూజీ, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ధైర్యంగా నిలబడ్డారు. న్యాయవాదిగా కూడా బాధితుల పక్షాన పనిచేసిన ఆయన ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యత ఇచ్చారని ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష కోసం తన పదవిని సైతం త్యాగం చేసిన నాయకుడిగా కొండా లక్ష్మణ్ బాపూజీ గుర్తింపు పొందారని ఆయన సేవలకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగానికి సంబంధించిన సంస్థకు ఆయన పేరు పెట్టిందనీ చేనేత కార్మికులు, డిజైనర్లకు ఆయన పేరుతో రాష్ట్రస్థాయి పురస్కారాలు కూడా అందజేస్తోందని
పదవుల కంటే ప్రజలే ముఖ్యం, వ్యక్తిగత ప్రయోజనాల కంటే తెలంగాణ ప్రయోజనాలే మిన్న” అనే స్ఫూర్తిని తన జీవితంతో చాటిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఆయన ఆశయాలను, ప్రజాసేవా స్ఫూర్తిని నేటి తరాలు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఈ సందర్భంగా కోరుతున్నామనీ అన్నారు
ఈ కార్యక్రమంలో పాల్గొని పద్మశాలి సంఘం అధ్యక్షులు బిక్షమయ్య ప్రధాన కార్యదర్శి ప్రకాష్ శ్రీనివాస్ మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
