మాజీ సైనికుని కుమార్తెకు MBBS సీటు…
తెల్లబల్లి గ్రామంలో తొలి వైద్య విద్యార్థినిగా నెమ్మాది సహస్త్ర…
సాక్షిత : సూర్యాపేట జిల్లా/ నడిగూడెం మండలం తెల్లబల్లి గ్రామానికి చెందిన మాజీ సైనికుడు నెమ్మాది రామారావు కుమార్తె నెమ్మాది సహస్త్ర ప్రతిష్టాత్మకమైన MBBS సీటు సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. తెల్లబల్లి గ్రామం నుంచి MBBSలో సీటు సాధించిన తొలి విద్యార్థినిగా సహస్త్ర గుర్తింపు పొందింది.
దేశవ్యాప్తంగా నిర్వహించిన NEET (National Eligibility cum Entrance Test) ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించి, తెలంగాణ ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS సీటు పొందింది. చిన్ననాటి నుంచి చదువుపై ఆసక్తి పెంచుకుని, కష్టపడి చదివి, పట్టుదలతో లక్ష్యాన్ని సాధించిన సహస్త్రను కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు అభినందించారు.
సహస్త్ర భవిష్యత్తులో వైద్య రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగి, సమాజానికి సేవ చేయాలని గ్రామస్థులు ఆకాంక్షించారు. మాజీ సైనికుడు నెమ్మాది రామారావు కుటుంబానికి కుమార్తె సాధించిన విజయం ఎంతో గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.
“కష్టపడి చదివితే కలలు సాకారం చేసుకోవచ్చు” అనే సందేశానికి సహస్త్ర విజయం ఒక మంచి ఉదాహరణ అని తెల్లబల్లి గ్రామానికి చెందిన మహిళలు, యువతీ యువకులు అన్నారు. గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చిన సహస్త్రను అభినందిస్తూ, ఆమె విజయం తమ గ్రామ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
