గణపయ్య ప్రతి ఒక్కరిని చల్లగా చూడయ్యా

Sakshitha news

గణపయ్య ప్రతి ఒక్కరిని చల్లగా చూడయ్యా

టి.యన్.సి సెంటర్ యువత సమక్షంలో 2000మంది కి పైగా అన్నదానం

వినాయక చవితి సందర్భంగా టి.యన్.సి సెంటర్ యువత ఏర్పాటుచేసిన “గణపయ్య” కోవూరు మండలంలోని ప్రత్యేకగా భక్తుల్ని ఆకట్టుకుంది. బొమ్మను పెట్టిన 4వ రోజు దాదాపుగా 2000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం టి.యన్.సి యువత ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని 26 సంవత్సరాలుగా ఇక్కడ గణపయ్య బొమ్మ పెట్టి వినాయక చవితి వేడుకలను ఘనంగా చేయడం జరుగుతుంది. బొమ్మ పెట్టిన 5 వరోజు ఆ గణపయ్య నిమజ్జనం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా స్వామి వారి ఊరేగింపు పూల అలంకరణలతో, విద్యుత్ దీపాలతో, మేళ తాళాలతో, బాణాసంచరితో జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. అలాగే మాకు సహకరిస్తున్న పెద్దలకి, ప్రజలకు, టి.యన్.సి సెంటర్ యూత్ ఉత్సవ కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.