ఎమ్మెల్యే KR నాగరాజుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు…

Sakshitha news

ఎమ్మెల్యే KR నాగరాజుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు…

హన్మకొండ సుబేదారిలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సంబరాలు జరిగాయి. వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు కి
పలువురు మహిళా నాయకులు రాఖీలు కట్టారు.నియోజకర్గవం నుండి వివిధ ప్రాంతాలు నుంచి తరలివచ్చిన మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పార్టీ కార్యాలయంలో సందడి నెలకొంది.రాఖీ పౌర్ణమి సందర్భంగా తరలివచ్చిన పార్టీ మహిళా నేతలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు కి రాఖీలు కట్టి స్వీట్లు కూడా తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.తనకు ఆప్యాయంగా రాఖీలు కట్టిన మహిళలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.వారికి బహుమతిగా చీరలను అందజేశారు. వారితో కాసేపు ఆత్మీయంగా మాట్లాడి, కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు.నియోజకవర్గంలోని ప్రతి అక్కాచెల్లెమ్మ ఆనందంగా, సురక్షితంగా ఉండాలని, వారి కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఎమ్మెల్యే KR నాగరాజు ఈ సందర్బంగా ఆకాంక్షించారు.

Scroll to Top