ముస్లిం ముస్లిం మైనారిటీల సంక్షేమం అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ .
ఉయ్యూరు షాదిఖానా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవానికి MLA బోడే ప్రసాద్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని నూతన కార్యవర్గo చేత ప్రమాణ స్వీకారం చేయించారు.అంతకు ముందు పట్టణ పార్టీ కార్యాలయం నుండి పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ. .ముస్లిం మైనారిటీ ల సంక్షేమం అభివృద్ధి కి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు అదే విధంగా విద్యా ఉపాధి, ఆర్థికాభివృద్ధి,మతపరమైన మౌలికపరమైన సదుపాయాల కల్పన ఇమామ్ మౌజన్లకు గౌరవ వేతనం , షాదిఖానా ల నిర్మాణం, విద్యార్థులకు స్కాలర్షిపు, ఉన్నత విద్యకు ప్రోత్సాహం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు
Mla బోడే ప్రసాద్ మాట్లాడుతూ… ఉయ్యూరు రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమం లో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
