రాఖీ పౌర్ణమి సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు రాఖీ కట్టిన కౌన్సిలర్ పద్మావతి సుందర్ రాజు

Sakshitha news

రాఖీ పౌర్ణమి సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు రాఖీ కట్టిన కౌన్సిలర్ పద్మావతి సుందర్ రాజు…!

ఉండవెల్లి మండల కేంద్రంలోని:

రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అలంపూర్ 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పద్మావతి సుందర్ రాజు పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య, జోగులాంబ గద్వాల జిల్లా డీసీసీ అధ్యక్షులు రాజీవ్ రెడ్డితో పాటు అలంపూర్ నియోజకవర్గంలోని మాజీ మండల అధ్యక్షులు మరియు నూతనంగా నియమితులైన మండల అధ్యక్షులకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ కట్టి, సోదరభావం, ఆత్మీయత, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top