సింగరేణి కార్మికులకు రక్ష కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు…

Sakshitha news

సింగరేణి కార్మికులకు రక్ష కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు…

11వ ఇంక్లైన్‌లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు.. బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య- అరుణ్‌కుమార్…

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరిఖని సింగరేణి 11వ ఇంక్లైన్ మైన్‌లో బీజేపీ రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సింగరేణి కార్మికులు, అధికారులు, సిబ్బందికి రక్ష కట్టి, మిఠాయిలు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయత, అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు.

సింగరేణి కార్మికులు సంస్థ అభివృద్ధికి అందిస్తున్న సేవలను కొనియాడుతూ, వారి కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని వారు కోరుకున్నారు. కార్మికులు, అధికారులు, సిబ్బందితో కలిసి పండుగ వేడుకలను నిర్వహించడం ద్వారా ఆత్మీయతను పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో బీఎంఎస్ పిట్ సెక్రటరీ వేల్పుల లక్ష్మణ్, ముల్గూరి వీరయ్య, పెద్దపల్లి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు వడ్డేపల్లి భారతి, మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలు మాతంగి రేణుక, కార్పొరేటర్ అభ్యర్థి అరిగేల శ్రవణ్, రాజు, నాయకులు సురేష్, శంకర్, కుమారస్వామి, హనుమంత్, మంజుల, రజిత, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top